21, సెప్టెంబర్ 2009, సోమవారం

తెలుగు సాహిత్య యుగవిభజన

తెలుగు సాహిత్యాన్నిక్రింది విధంగా విభజించారు
౧ ప్రాక్ నన్నయ యుగము .క్రీ.శ .౧౦౦౦
౨ నన్నయ యుగము .క్రీ .శ.౧౦౦౦-1100
౩ శివకవి యుగము .క్రీ.శ.౧౧౦౦-1225
౪ తిక్కన యుగము .క్రీ.శ.౧౨౨౫-1320
౫ ఎఱ్ఱ ప్రగడ యుగము.క్రీ.శ.౧౩౨౦-1400
౬ శ్రీనాథ యుగము.క్రీ.శ.౧౪౦౦-1500
౭ రాయల యుగము.క్రీ.శ.౧౫౦౦-1600
౮ దక్షిణాంధ్ర యుగము. లేదా నాయక రాజులయుగముక్రీ.శ.౧౬౦౦-1775
౯.క్షీణ యుగము.క్రీ.శ.౧౭౭౫-1875
౧౦.ఆధునిక యుగము.క్రీ.శ.౧౮౭౫...

2 కామెంట్‌లు:

  1. క్రీ.శ. 1775 నుండి 1875 వరకు ’ క్షీణ యుగం ’ అనడం పరిపాటి అయింది. ఇది మన పూర్వ సాహితీ చరిత్రకారులు సరైన అవగాహన లేక సృష్టించిన అపప్రథ.
    నిజానికి 20 వ శతాబ్ది ’ నవ్య కవిత్వం ’ ఒక్కసారి ఎక్కడినుండో ఊడి పడలేదు. దాని తాలూకు బీజాలన్నీ 19 వ శతాబ్దిలోనే పడ్డాయి. 19 వ శతాబ్దిలో నవ్యత గలిగి, 20 వ శతాబ్ది నవ్య కావ్యాలకు మార్గ దర్శనం చేసిన సుమారు 80 కావ్యాలను సమూలంగా విశ్లేషించి, సోపపత్తికంగా పై విషయాన్ని నిరూపించి, 19 వ శతాబ్ది తెలుగు సాహిత్యానికి ’ క్షీణ యుగం ’ అని కాకుండా ’ ఉషోదయ యుగం ’ అని పునర్నామకరణం చేయాలని ప్రతిపాదిస్తూ, నేనొక సిద్ధాంత గ్రంథాన్ని రచించి, ఉస్మానియా విశ్వ విద్యాలయానికి 2006 లో సమర్పించాను. ’ 19 వ శతాబ్ది తెలుగు కవిత్వంలో నవ్యత ’ అన్న ఆ సిద్ధాంత గ్రంథానికిగాను, నాకు ఉస్మానియా విశ్వ విద్యాలయం పిహెచ్.డి ( డాక్టరేట్ ) పట్టాను ప్రదానం చేసింది. నా సిద్ధాంత గ్రంథాన్ని త్వరలో ముద్రించే అవకాశాలకై ప్రస్తుతం అన్వేషణలో ఉన్నాను.

    రిప్లయితొలగించండి
  2. Dr jI

    if possible can you send me that book in pdf ?

    the book which talks about ushOdaya yugaM.

    chavakiran at gmail dot com

    రిప్లయితొలగించండి