6, అక్టోబర్ 2009, మంగళవారం

క్షీణయుగం ౧౭౭౫-౧౮౭౫

క్షీణ యుగం లోని కొందరు కవులు వారు రాసిన కావ్యాలు .
కంకంటి పాపరాజు - -ఉత్తర రామాయణము
కనుపర్తి అబ్బయామాత్యుడు-అనిరుద్దచరిత్రము
కూచిమంచి తిమ్మకవి - కుక్కుటేశ్వర శతకం,నీలాసుందరి పరిణయము ,అచ్చతెనుగు
రామాయణము ,రుక్మిణి కళ్యాణము
కూచిమంచి జగ్గకవి -చంద్రలేఖ విలాపము
వక్కలంక వీరభద్రకవి -వాసవదత్త పరిణయము
అడిదము సూరకవి -చంద్రమతి పరిణయము ,రామలింగేశ్వర శతకము
ధరణి దేవుల రామయమంత్రి -దశావతారచరిత్రము
౧౯ వ శతాబ్ది కవులు
దిట్టకవి నారాయణకవి -రంగరాయచరిత్రము
చిత్రకవి సింగనార్యుడు -బిల్హణీయము
కృష్ణదాసు -రాధాకృష్ణ విలాసము (పద్యకావ్యము)
వేమనరాధ్యుల sఅంగమేస్వరకవి -అహల్యాసంక్రందనము
అయ్యలరాజు నారాయణకవి -హంసవింసతి
గట్టు ప్రభువు -కుచేలోపాఖ్యానము
కృష్ణకవి -శకుంతలాపరినయము
కొత్తలంక మృత్యుంజయకవి -ధరాత్మజా పరిణయము
బుక్కపట్నం తిరుమల వెంకటాచార్యులు -ఆచలాత్మజా పరిణయము
అయ్యగారి వీరభద్రకవి -యాదవరాఘవ పాండవీయము
ఓరుగంటి సోమ సేఖరకవి- -రామక్రిష్ణార్జున రూప నారాయణీయము
పిండి ప్రోలు లక్ష్మణ కవి -రావణ దమ్మీయము (లంకావిజయము)
తరిగొండ వెంగమాంబ -వేంకటాచల మహత్యము ,రాజయోగసారము (ద్విపద)
చెళ్ళపిళ్ళ నరసకవి -వెంకటేశ్వర విలాసము,యామినీ పూర్ణ తిలకా విలాసము
మండపాక పార్వతీశ్వర శాస్త్రి -రాధాకృష్ణ సంవాదము

21, సెప్టెంబర్ 2009, సోమవారం

తెలుగు సాహిత్య యుగవిభజన

తెలుగు సాహిత్యాన్నిక్రింది విధంగా విభజించారు
౧ ప్రాక్ నన్నయ యుగము .క్రీ.శ .౧౦౦౦
౨ నన్నయ యుగము .క్రీ .శ.౧౦౦౦-1100
౩ శివకవి యుగము .క్రీ.శ.౧౧౦౦-1225
౪ తిక్కన యుగము .క్రీ.శ.౧౨౨౫-1320
౫ ఎఱ్ఱ ప్రగడ యుగము.క్రీ.శ.౧౩౨౦-1400
౬ శ్రీనాథ యుగము.క్రీ.శ.౧౪౦౦-1500
౭ రాయల యుగము.క్రీ.శ.౧౫౦౦-1600
౮ దక్షిణాంధ్ర యుగము. లేదా నాయక రాజులయుగముక్రీ.శ.౧౬౦౦-1775
౯.క్షీణ యుగము.క్రీ.శ.౧౭౭౫-1875
౧౦.ఆధునిక యుగము.క్రీ.శ.౧౮౭౫...

28, ఆగస్టు 2009, శుక్రవారం

తెలుగు సాహిత్య విశేషాలు

తెలుగు భాష అంతరించి పోతోందని ఇటీవల భాషాభిమానులు కొందరు ఆవేదన వ్యక్తం చేయడం మనమందరం గమనిస్తూనే వున్నాం.ఐతే ఇదంతా నగరవాసుల గోలే తప్ప ఆంధ్రులందరి ది కాదు .గ్రామాల్లో చిన్న పట్టణాల్లో
ఈ పరిస్థితి లేదు.సిటీల్లో పోటీ తత్వం తో ప్రతి వోక్కరు ఇంగ్లిష్ మీడియం లో చదువులు సాగించడం వల్లే వారికలా
అనిపిస్తోంది.తాజా గా ఈ రోజు రెండు వేలా ఇరవయ్ ఇదు నాటికి తెలుగు భాష వుండదు అని కొందరు ప్రబుద్దులు
తేల్చి చెప్పినట్లు వో పత్రిక లో వచ్చింది.నాలుగ్గోడల మధ్య కూర్చుని ఏ బావిలో కప్ప తీర్మానించిందో కాని ఇలాంటి మతిలేని సర్వేలను మేధావులమని చెప్పు కునే పత్రికలు ఎందుకు ప్రచురిస్తాయో అర్థం కాదు. అంటే ఇప్పుడు తెలుగు మాట్లాడే వారంతా ఇరవయ్ ఇదు నాటికి చస్తారనా వారి ఆలోచన.లేక అప్పటికి అందరికి మతిమరుపు వచ్చి తెలుగు మర్చి పోయి ఇంగ్లిష్ మాత్రమే గుర్తుం చుకుంతారనా వారి వెధవ ఐడియా.వేలఏండ్లుగా క్రమాను గతమైన మార్పుచెందుతూ వస్తున్న తెలుగు భాష వొక్క సారిగా ఆవిరి అయిపోతుందనడం మూర్ఖత్వం .ఇది ఎనిమిది కోట్ల పైగా వున్నతెలుగు వారిని అవమానించడమే.
ఈ నేపధ్యం లో ఈ బ్లాగు ద్వారా తెలుగు భాష ఎంత ప్రాచీనమైనదో ఎంత మధుర మైనదో ,ఎన్ని విశేశాలున్నా యో వరుసగా వీక్షకులకు తెలియచేబుతాను.