28, ఆగస్టు 2009, శుక్రవారం

తెలుగు సాహిత్య విశేషాలు

తెలుగు భాష అంతరించి పోతోందని ఇటీవల భాషాభిమానులు కొందరు ఆవేదన వ్యక్తం చేయడం మనమందరం గమనిస్తూనే వున్నాం.ఐతే ఇదంతా నగరవాసుల గోలే తప్ప ఆంధ్రులందరి ది కాదు .గ్రామాల్లో చిన్న పట్టణాల్లో
ఈ పరిస్థితి లేదు.సిటీల్లో పోటీ తత్వం తో ప్రతి వోక్కరు ఇంగ్లిష్ మీడియం లో చదువులు సాగించడం వల్లే వారికలా
అనిపిస్తోంది.తాజా గా ఈ రోజు రెండు వేలా ఇరవయ్ ఇదు నాటికి తెలుగు భాష వుండదు అని కొందరు ప్రబుద్దులు
తేల్చి చెప్పినట్లు వో పత్రిక లో వచ్చింది.నాలుగ్గోడల మధ్య కూర్చుని ఏ బావిలో కప్ప తీర్మానించిందో కాని ఇలాంటి మతిలేని సర్వేలను మేధావులమని చెప్పు కునే పత్రికలు ఎందుకు ప్రచురిస్తాయో అర్థం కాదు. అంటే ఇప్పుడు తెలుగు మాట్లాడే వారంతా ఇరవయ్ ఇదు నాటికి చస్తారనా వారి ఆలోచన.లేక అప్పటికి అందరికి మతిమరుపు వచ్చి తెలుగు మర్చి పోయి ఇంగ్లిష్ మాత్రమే గుర్తుం చుకుంతారనా వారి వెధవ ఐడియా.వేలఏండ్లుగా క్రమాను గతమైన మార్పుచెందుతూ వస్తున్న తెలుగు భాష వొక్క సారిగా ఆవిరి అయిపోతుందనడం మూర్ఖత్వం .ఇది ఎనిమిది కోట్ల పైగా వున్నతెలుగు వారిని అవమానించడమే.
ఈ నేపధ్యం లో ఈ బ్లాగు ద్వారా తెలుగు భాష ఎంత ప్రాచీనమైనదో ఎంత మధుర మైనదో ,ఎన్ని విశేశాలున్నా యో వరుసగా వీక్షకులకు తెలియచేబుతాను.